ఆ పదవి రావడం నా అదృష్టం
హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దైవసన్నిధానంలో శ్రీస్వరూపానందేశ్వర సరస్వతి స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మోహన్‌బాబు, పరుచూరి గోపాలకృష్ణ, ఆలయ నిర్వాహకులు హాజరై స్వరూపానందేశ్వర సరస్వతి స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదానం, వస్త్ర దానం చేశారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ ఫిలింనగర్ దేవాలయాన్ని సినిమా నటీనటులందరి కోసం అప్పటి ప్రభుత్వం నిర్మించింది. ఇది వైజాగ్‌లో ఉండే శ్రీస్వరూపానందేశ్వర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో నడుస్తుంది. భారతదేశంలోని దాదాపు 70 దేవాలయాలు ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వారి ద్వారా, ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ ద్వారా నాకు ఈ ఆలయ చైర్మన్ పదవి రావడం నా అదృష్టం. ఈ దేవాలయంలో 18 మంది దేవుళ్లు కొలువై ఉన్నారు అని అన్నారు.













