మూడోసారి ఖాకీ డ్రెస్ వేయనున్న బెల్లం బాబు
మూడేళ్ల పాటూ తన విలువైన కాలాన్ని ఖర్చు పెట్టుకుని హిందీ ఛత్రపతి రీమేక్ చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి ఆ సినిమా దారుణమైన డిజాస్టర్‌ని ఇచ్చింది. సినిమా యావరేజ్ కూడా కాకుండా ఏకంగా డిజాస్టర్ కావడంతో బెల్లం బాబు చాలా నిరాశ పడ్డాడు. దీంతో తనకు టాలీవుడ్ కరెక్ట్ అనుకుని వెంటనే లేట్ చేయకుండా తన తర్వాతి సినిమాను స్టార్ట్ చేశాడు.
భీమ్లా నాయక్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ సాగర్ కె చంద్ర ఆ తర్వాత ఓ యాక్షన్ కమర్షియల్ స్క్రిప్ట్ ని రెడీ చేశారు. దీని పూజా కార్యక్రమాలు కూడా రీసెంట్‌గానే జరిగాయి. ఆ సినిమాకు టైసన్ నాయుడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆ టైటిల్‌ను ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేశారని ఇన్సైడ్ టాక్.
కాగా ఈ సినిమా పోలీస్ బ్యాక్ డ్రాప్లో సాగుతుందట. బెల్లం హీరో ఇప్పటి వరకు రెండు సార్లు ఖాకీ యూనిఫార్మ్ వేసుకున్నాడు. మొదటిసారి బెల్లంబాబు కవచం సినిమా కోసం పోలీస్ డ్రెస్ వేయగా, ఆ సినిమా తనకు నిరాశ పరిచింది. తర్వాత రెండోసారి రాక్షసుడు సినిమా కోసం ఖాకీ డ్రెస్ వేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పోలీస్ డ్రెస్ వేయబోతున్నాడు బెల్లం బాబు. మంచి మాస్ ఎలిమెంట్స్‌తో హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడట సాగర్ చంద్ర. అంతేకాదు ఈ సినిమా కోసం భారీ సెట్స్ కూడా వేస్తున్నారు మేకర్స్. హీరోయిన్ గా శ్రీలీలను ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.













