Sreenidhi Shetty: వయొలెన్స్ నన్ను వదలడం లేదు
కెజిఎఫ్(KGF1), కెజిఎఫ్2(KGF2) సినిమాలతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి(Sreenidhi Shetty) ఇప్పుడు నాని హీరోగా వస్తున్న హిట్3 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. శ్రీనిధి తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇదే. కెజిఎఫ్, కెజిఎఫ్2, హిట్3(Hit3) సినిమాలు మూడూ హింసతో కూడుకున్నవే అని, తాను ఎంత అవాయిడ్ చేద్దామన్నా హింస తనను వదలడం లేదని చెప్తోంది శ్రీనిధి.
హిట్3 ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న శ్రీనిధి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హిట్3 గురించి పలు విషయాలను వెల్లడించింది. అందరూ అనుకున్నట్టు హిట్3 కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదని, అందులో క్రైమ్, ఇన్వెస్టిగేషన్, డ్రామా, లవ్, యాక్షన్ అన్నీ ఉంటాయని, కాకపోతే యాక్షన్ పార్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
హిట్3 కథ విన్నప్పుడే ఈ సినిమాలో యాక్షన్ ఎక్కువ ఉంటుందని అర్థమైందని, అపపుడే ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ వస్తుందని అనుకున్నానని, ఈ విషయాన్నే ఎప్పుడూ నాని(Nani)తో చెప్తుంటానని, నువ్వు ఏ సర్టిఫికెట్ సినిమా చేయడానికి నీకు 16 ఏళ్లు పట్టిందని, కానీ నేను నాలుగో సినిమాకే చేస్తున్నానని అంటుంటానని చెప్పింది. ఈ సినిమాకు తెలుగులో డబ్బింగ్ కూడా తానే చెప్పుకున్నానని, డబ్బింగ్ విషయంలో డైరెక్టర్ శైలేష్(Sailesh Kolanu) తనకెంతో హెల్ప్ చేశాడని చెప్పింది. హిట్3 సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.






