లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఓకే చెప్పిన శ్రీలీల
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ఎవరంటే ఠక్కున శ్రీలీల పేరు చెప్పేస్తారు. స్టార్ హీరోలతో మొదలపెట్టి, చిన్న, మధ్య తరహా హీరోలతో కలిసి నటిస్తున్న ఈమె, రీసెంట్గా గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే స్థానంలో ఛాన్స్ కొట్టేసింది. ఇంత క్రేజ్ ఉన్న టైమ్ లో ఆమె తీసుకునే డెసిషన్స్ అందరినీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి.
స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ, బాలయ్య సినిమాలో ఆయనకు కూతురిగా నటించేందుకు సైన్ చేసి అందరి మతి పోగొట్టిన శ్రీలీల, సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ లకు కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ఓకే అనేస్తుంది. అంతే కాదు ఇప్పుడు ఏకంగా అమ్మడు ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.
ఎప్పుడో కెరీర్ డల్ అయిన టైమ్ లోనో లేకపోతే స్టార్ హీరోయిన్ స్టేటస్ ని ఎంజాయ్ చేశాకనో ఇలాంటి సినిమాలు చేస్తుంటారు. కానీ అమ్మడు మాత్రం కెరీర్ స్టార్టింగ్ లోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఓకే చెప్పి షాకయ్యేలా చేస్తుంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది.
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా స్టోరీ లైన్ శ్రీలీలకు బాగా నచ్చడంతో వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో కమర్షియల్ హీరోయిన్ గా కనిపించడానికి రెడీ అయిన శ్రీలీల మరోవైపు ఇలా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఒప్పుకోవడం కూడా గ్రేట్ అనే చెప్పాలి.













