శ్రీలీల డెసిషన్ కరెక్టే!
సినిమాలో ఒక మంచి ఛాన్స్ వద్దనుకోవాలంటే హీరోయిన్లు పడే బాధ మామూలుగా ఉండదు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న టిల్లూ స్వ్కేర్ లో అనుపమ పరమేశ్వరన్ కు ముందు అందులో హీరోయిన్ గా శ్రీలీలను అనుకున్నారు. కానీ కొన్ని సీన్స్ షూట్ చేశాక శ్రీలీల ఆ సినిమా నుంచి తప్పుకుంది.
స్టోరీ పరంగా బోల్డ్ క్యారెక్టర్ కావడం వల్లే శ్రీలీల టిల్లూ స్వ్కేర్ నుంచి తప్పుకుందని టాక్ వినిపించింది. కట్ చేస్తే ఆ ప్లేస్ లో అనుపమ వచ్చి చేరింది. లిల్లీగా అనుపమ అలరించిన తీరు ఆడియన్స్ కు చాలా బాగా నచ్చింది. ఒకవేళ ఇదే క్యారెక్టర్ శ్రీలీలీ చేసుంటే కచ్ఛితంగా తన ఇమేజ్, ఛాన్స్ ల మీద ఎఫెక్ట్ పడేది.
అనుపమ అంటే పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు చేసి చేసి విసుగొచ్చి ఇలాంటి క్యారెక్టర్ల వైపు టర్న్ తీసుకుంది. కానీ శ్రీలీలకు ఆ అవసరం లేదు. అందుకే ఇప్పుడు సినిమా చూశాక శ్రీలీల డెసిషన్ కరెక్ట్ అంటున్నారు. కాకపోతే ఇలాంటి పెద్ద బ్లాక్ బస్టర్ లో భాగం కాలేకపోవడం లోటే కానీ ఎవరైనా సరే సూటయ్యేవే ఎంచుకోవాలని అనుకోవడం మంచిదే. గుంటూరు కారం ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయినా శ్రీలీల డ్యాన్సులకు మాత్రం మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ఎంబిబిఎస్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న శ్రీలీల చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే ఉంది.













