Sree Leela: బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో శ్రీలీల బిజీబిజీ
గతేడాది ఒకే టైమ్ లో మూడు నాలుగు షూటింగుల్లో పాల్గొంటూ ఎంతో బిజీగా ఉన్న శ్రీలీల(Sree Leela) గుంటూరు కారం(Guntur Karam) తర్వాత బ్రేక్ తీసుకుంది. ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ కోసం కొత్త కమిట్మెంట్స్ కూడా ఇచ్చింది లేదు. ఇప్పుడు మళ్లీ శ్రీలీల డైరీ మరో రెండేళ్ల వరకు ఖాళీగా లేదు. రీసెంట్ గా పుష్ప2(Pushpa2)లో కిసిక్ సాంగ్(Kissik Song) చేసి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకుంది శ్రీలీల.
నితిన్(Nithin) తో చేసిన రాబిన్ హుడ్(Robinhood) పోస్ట్‌పోన్ అవడం ఖాయమే కాబట్టి ఈ ఇయర్ శ్రీలీల నుంచి వచ్చిన సినిమా గుంటూరు కారం మాత్రమే. ఇదిలా ఉంటే శ్రీలీల వచ్చే ఏడాది ఓ రేంజ్ లో బిజీగా ఉండేట్లు అనిపిస్తుంది. జనవరిలో రాబిన్ హుడ్ రిలీజ్ కానుంది. తర్వాత మే 9న రవితేజ(Ravi teja) మాస్ జాతర(Mass Jathara) రానుంది.
ఇవి కాకుండా శివ కార్తికేయన్(Siva Karthikeyan), సుధ కొంగర(Sudha Kongara) కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో శ్రీలీలనే హీరోయిన్. రీసెంట్ గా మొదలైన అఖిల్6(Akhil6) లో కూడా అమ్మడే హీరోయిన్. నాగ చైతన్య(Naga Chaitanya)- కార్తీక్ దండు(Karthik Dandu) కలయికలో వస్తున్న మిస్టరీ థ్రిల్లర్ లో కూడా హీరోయిన్ గా శ్రీలీలనే ఎంపికైంది. వీటితో పాటూ ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagath Singh) ఉండనే ఉంది. నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty)తో అనగనగా ఒక రోజు, సిద్దూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda)తో కోహినూర్(Kohinoor) సినిమాలు కూడా శ్రీలీల చేతిలో ఉన్నాయి. చూస్తుంటే శ్రీలీల గతేడాది కంటే వచ్చే ఏడాదే ఎక్కువ బిజీగా ఉండేట్లు అనిపిస్తోంది.













