Spirit: స్పిరిట్ అంత ఫాస్ట్ గా అయిపోతుందా?
టాలీవుడ్ సినిమాల స్థాయి బాగా పెరిగిన నేపథ్యంలో ప్రతీ హీరో తమ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ జాగ్రత్తల వల్ల సినిమాల మేకింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. దీంతో ఒక్కో సినిమాకు కనీసం రెండేళ్లు పడుతుంది. కానీ ప్రభాస్(prabhas) మాత్రం ఒకేసారి రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లి అందరికీ భిన్నంగా నిలిచారు.
ప్రస్తుతం ది రాజా సాబ్(the raja saab), ఫౌజీ(Fauji) సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఓ వైపు మారుతి(maruthi) దర్శకత్వంలో ది రాజా సాబ్ ను చేస్తూ దాన్ని ఆఖరి దశకు తీసుకొచ్చిన ప్రభాస్, మరోవైపు హను రాఘవపూడి(hanu raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ రెండు సినిమాలను పూర్తి చేశాక ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా(sandeep reddy vanga) దర్శకత్వంలో స్పిరిట్(spirit) ను మొదలుపెట్టనున్నాడు.
స్పిరిట్ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఇప్పటికే వచ్చినా ఇంకా ఆ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే ఇప్పుడు స్పిరిట్ కోసం సందీప్ రెడ్డి వంగా ఓ భారీ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్ తో ఉన్నప్పటికీ స్పిరిట్ ను కేవలం ఏడాదిలోపే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ను పూర్తి చేసి వీలైనంత త్వరగా రిలీజ్ చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని చూస్తున్నాడట. మరి ఇదెంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.







