సోను సూద్ మరోసారి సాయం
సోను సూద్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. రంజాన్ సందర్భంగా 25 వేల మంది వలస కార్మికులకు భోజనం పెడతానని ప్రకటించారు. ఇప్పటికే ఈయన రోజూ 45 వేల మందికి భోజనం పెడుతున్నారు. కర్నాటక, ఉత్తర ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ నుంచి పనుల కోసం మహారాష్ట్రలోని భివాందికొచ్చిన కార్మికులు పడుతున్న ఇబ్బందులు గురించి సోనుసూద్ దృష్టికి కొందరు తీసుకొచ్చారు. రంజాన్ సమయంలో వీరందరికీ ప్రత్యేకంగా వంగ గదులు ఏర్పాటు చేసి భోజనం అందేలా చూస్తానని చెప్పారు. 1.5 లక్షల భోజనాలు అందించడమే తన లక్ష్యమని అందులో భాగంగా వీరందరికీ సాయం చేస్తున్నానని ఈ సందర్భంగా సోను తెలిపారు. ఇప్పటికే కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి తన హోటల్‌ను కేటాయించారు.













