ఆ హీరోయిన్ ను రంగంలోకి దించిన త్రివిక్రమ్
వెటరన్ యాక్ట్రెస్‌ను రంగంలోకి దించి ప్రతీ సినిమాతో సక్సెస్ అందుకోవడం త్రివిక్రమ్ టాలెంట్. అత్తారింటికి దారేదిలో నదియా, సన్నాఫ్ సత్యమూర్తిలో స్నేహ, అఆలో మళ్లీ నదియాను రిపీట్ చేయడం, అజ్ఞాతవాసిలో ఖుష్బూ, అరవింద సమేతలో దేవయాని, అల వైకుంఠపురములో టబుని రంగంలోకి దింపిన త్రివిక్రమ్, ఈసారి గుంటూరు కారంలో కూడా అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడని తెలుస్తోంది.
సంక్రాంతికి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో త్రివిక్రమ్, మహేష్ ఫ్యాన్స్ కు ఓ సర్ప్రైజ్ ను ప్లాన్ చేశాడట. ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ కోసం సోనాలీ బింద్రేని త్రివిక్రమ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గుంటూరు కారంలో తెరపై కాసేపు సోనాలి సందడి చేయనుందట. దాదాపు 20 నిమిషాల పాటూ సోనాలి తెరపై కనిపించనుందని ఫిల్మ్ నగర్ టాక్.
ఆ ఇరవై నిమిషాల సన్నివేశాలు కూడా మహేష్ తోనే ఉంటాయని తెలుస్తోంది. ఇదే నిజమైతే మురారీ జోడీని త్రివిక్రమ్ మళ్లీ గుర్తు చేసినట్లే. ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది కానీ నిప్పు లేనిదే పొగ రాదంటున్నారు నెటిజన్లు. ఇక సినిమా విషయానికొస్తే శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.













