నాగార్జున ‘బంగార్రాజు’ సరసన బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా?

లేటెస్ట్ గా బాలీవుడ్ హీరోయిన్ టాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు మరో బ్యూటీ రెడీ అవుతోందట. కింగ్ నాగార్జునతో దబాంగ్ సినిమా హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్. ఇటీవల ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు కింగ్ అక్కినేని నాగార్జున. హైదరాబాద్‌లో జరిగిన బాంబు బ్లాస్టుల తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్, టెర్రరిస్ట్ ఆపరేషన్ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అయితే ఈ సినిమా థియేటర్లలో అంతగా అలరించకపోయినప్పటికీ. నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీలో మాత్రం ట్రెండింగ్ తో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే నాగార్జున ‘బంగార్రాజు’ అనే టైటిల్‌తో తన నెక్ట్స్ సినిమా చేస్తున్నారు. 2015 సంక్రాంతికి విడుదలై భారీ హిట్‌ను సొంతం చేసుకున్న సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’. ఈ సినిమాకు సీక్వెల్‌గా బంగార్రాజును రూపొందిస్తున్నట్లు ఎప్పుడో ప్రకటన చేశారు. గ్రామీణ నేపథ్యంలోనే మరో సినిమా చేయాలని భావించిన నాగార్జున, కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు. చాలా రోజుల పాటు ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
అయితే ఇటీవలే డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఆ పని ఫినిష్ చేశారట. ఈ ఏడాది జూలై రెండవ వారంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రమ్యకృష్ణతో పాటు నాగార్జున తనయుడు నాగ చైతన్య కూడా ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్‌గా ‘దబాంగ్’ బ్యూటీ సోనాక్షి సిన్హాని అనుకుంటున్నారట. బాలీవుడ్ స్టార్ హీరో, మాజీ కేంద్ర మంత్రి శతృజ్ఞ సిన్హా కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సోనాక్షి, గతంలో రజనీకాంత్ సరసన ‘లింగా’ అనే సినిమాలో చేసింది. అయితే కొంతకాలంగా ఈ అమ్మడికి సరైన హిట్లు లేకపోవడంతో టాలీవుడ్‌పైపు ప్రయత్నాలు ప్రారంభించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో బంగార్రాజు సినిమా బృందం ఆమెకు తొలి టాలీవుడ్ అవకాశం కల్పించాలని భావిస్తున్నారట. అయితే నాగార్జున సరసన హీరోయిన్‌గా చేస్తే తనకు మంచి బ్రేక్ లభించే అవకాశం ఉందని సోనాక్షి కూడా అనుకుంటోందని సమాచారం.