Sonakshi Sinha: నా సినిమాలకు నేనే హీరో

దబాంగ్(dabang) మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చిన సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) మొదటి సినిమాతోనే మంచి ప్రశంసలందుకుంది. ఆ తర్వాత కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ కొన్ని నటనా ప్రాధాన్యమున్న క్యారెక్టర్లు చేసినప్పటికీ అవేవీ సోనాక్షి కెరీర్ కు హెల్ప్ అవలేదు. అయితే సోనాక్షి థియేటర్లలో కనిపించి మూడేళ్లవుతుంది. త్వరలోనే ఆమె నుంచి నికితా రాయ్(Nikitha Roy) అనే సినిమా రాబోతుంది.
ఖుష్ సిన్హా(Kush Sinha) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హార్రర్ థ్రిల్లర్ ప్రమోషన్స్ లో సోనాక్షి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. తన కెరీర్లో అకీరా(Akira), నూర్(Noor) లాంటి సినిమాలు ఎలాగైతే మైలురాళ్లుగా నిలిచాయో ఇప్పుడు నికితా రాయ్ కూడా అలానే నిలుస్తుందని, థియేటర్లో ఈ సినిమా ప్రతీ ఒక్కరినీ పరుగులు పెట్టిస్తుందని, గత కొన్నేళ్ళుగా తాను నటించిన పాత్రలకు భిన్నంగా తన భవిష్యత్తు జర్నీ ఉంటాలనుకుంటున్నాని సోనాక్షి చెప్పింది.
ఇక మీదట కెరీర్లో ఎక్కువగా మహిళా పాత్రలు, వాటికి సంబంధించిన కథలపైనే ఫోకస్ చేయనున్నానని, సినిమా మొత్తాన్ని భుజాలపై వేసుకుని టైటిల్ రోల్ చేయడం అంత ఈజీ కాదని, అయినప్పటికీ ఇకపై తన సినిమాలకు తానే హీరోగా ఉండాలనుకుంటున్నట్టు సోనాక్షి చెప్పారు. మిడిల్ క్లాస్ ఆడియన్స్ థియేటర్లకు రాకపోవడానికి కారణం పెరిగిన టికెట్ రేట్లేనని కూడా ఆమె ఈ సందర్భంగా తెలిపింది.