Sobhitha Dhulipala: సెన్సేషనల్ డైరెక్టర్ తో శోభిత మూవీ?
శోభితా ధూళిపాళ(Sobhitha Dhulipala) తెలుగు అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసింది. తెలుగులో కూడా పలు సినిమాలు చేసిన శోభితకు ఇప్పటివరకు కోరుకున్న స్టేటస్ మాత్రం రాలేదు. గత డిసెంబర్ లో నాగ చైతన్య(Naga Chaitanya)ను ప్రేమించి పెళ్లి చేసుకుని మూవీస్ నుంచి కొంత గ్యాప్ తీసుకున్న శోభిత ఇప్పుడు మళ్లీ తిరిగి యాక్టింగ్ లో బిజీ అవాలనుకుంటోంది.
అయితే ఇప్పుడు శోభితకు ఓ బంపరాఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. సంచలన దర్శకుడు పా. రంజిత్(Pa. Ranjith) దర్శకత్వంలో శోభిత హీరోయిన్ గా నటించనున్నట్టు సమాచారం. రంజిత్ సినిమాలోని కథలే కాదు, ఆయన డైరెక్షన్ కూడా వేరే డైరెక్టర్ల సినిమాలకు చాలా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం రంజిత్ వెట్టువన్ చేస్తున్న సినిమా చేస్తున్నాడు. అందులో దినేష్(Dinesh) హీరోగా నటిస్తుండగా, ఆర్య(Aarya) విలన్ గా చేస్తున్నాడు. ఈ సినిమాలో శోభిత హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది.
రంజిత్ సినిమాలో నటించే నటీనటులకు ఎప్పుడూ మంచి గుర్తింపుతో పాటూ క్రేజ్ కూడా వస్తుంది. దానికి కారణం ఆయన తను అనుకున్న పాత్రకు సరిగ్గా సరిపోతారనుకుంటేనే వారిని అప్రోచ్ అవుతారు. అలాంటి రంజిత్ దర్శకత్వంలో నటించే ఛాన్స్ దక్కిందంటే శోభితకు ఇది బంపారఫర్ అనే చెప్పాలి. పెళ్లి తర్వాత నాగ చైతన్య(Naga Chaitanya) తండేల్(Thandel) మూవీతో హిట్ కొట్టినట్టు, శోభిత కూడా ఈ సినిమాతో హిట్ కొడుతుందేమో చూడాలి.













