Sobhitha Dhulipala: లవ్ స్టోరీని రివీల్ చేసిన శోభిత
సమంత(Samantha)తో విడిపోయాక నాగచైతన్య(Naga Chaitanya) నటి శోభితా ధూళిపాల(Sobhitha Dhulipala)ను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. వీరి ప్రేమ గురించి ఎప్పటినుంచో వార్తలొచ్చాయి. కానీ వాటిని అందరూ రూమర్లే అనుకున్నారు. ఇటీవలే వారి జంట పెళ్లితో ఒక్కటైంది. ఈ నేపథ్యంలో అసలు వీరిమధ్య ప్రేమ ఎలా స్టార్ట్ అయిందనేది ఆసక్తికరంగా మారింది.
అయితే ఈ ప్రశ్నకు శోభితనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చింది. 2022 ఏప్రిల్ నుంచి తను చైతూని ఇన్‌స్టాలో ఫాలో అవగా, తర్వాత చైతూ కూడా ఆమెను ఫాలో అయ్యాడట. తను ఇన్‌స్టాలో షేర్ చేసే స్పూర్తివంతమైన కథనాలు, అభిప్రాయాలకు సంబంధించిన పోస్ట్‌లను మాత్రమే చైతూ లైక్ చేసేవాడని తెలిపింది.
తనకు ఫుడ్ అంటే చాలా ఇష్టమని, తను చైతన్య ఎప్పుడు కలిసినా ఫుడ్ గురించే మాట్లాడుకునేవారిమని, తనను తెలుగులో మాట్లాడమని చైతూ ఎప్పుడూ అడిగేవాడని, అలా మాట్లాడటమే తమ మధ్య బంధాన్ని బలం చేసిందని, తామిద్దరూ ఫస్ట్ టైమ్ ముంబైలోని ఓ కేఫ్ లో కలిసినట్టు శోభిత చెప్పుకొచ్చింది. ఆ సమయంలో చైతూ(Chaithu) హైదరాబాద్ లో ఉంటే తను ముంబైలో ఉన్నట్లు అమ్మడు వెల్లడించింది.













