SJ Surya: అందరూ ఎస్జె సూర్యని చూసి నేర్చుకోవాల్సిందే!
నటులందరూ సినిమాల్లో నటిస్తారు. కానీ చాలా తక్కువ మందే నటించిన సినిమాలను ప్రమోట్ చేయడానికి ముందుంటారు. కొంతమంది అసలు ప్రమోషన్స్ తమ పని కాదన్నట్టు ప్రవర్తిస్తుంటారు. ఒకవేళ అడిగితే నేనింతే అంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో లీడ్ యాక్టర్లు ప్రమోషన్స్ లో భాగమైతే తప్ప సినిమా ఆడియన్స్ కు రీచ్ అవదు.
ఈ ఫార్ములాని వంటపట్టించుకున్న ఎస్జె సూర్య(SJ Surya) గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ఏ భాషలో సినిమాలు చేసినా ప్రమోషన్స్ ను మాత్రం అసలు మిస్ అవడం లేదు. గేమ్ ఛేంజర్(Game Changer) ట్రైలర్ లాంచ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. లోకలే కాబట్టి చెన్నై ఈవెంట్ లో భాగమయ్యాడు. ముంబై కూడా వెళ్లి ఇప్పుడు డైరెక్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమండ్రి చేరుకున్నాడు.
తర్వాత టీమ్ తో కలిసి బెంగుళూరు కూడా వెళ్లనున్నాడు సూర్య. ఏ నగరానికి వెళ్లినా అక్కడి స్థానిక భాషలో మాట్లాడి అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్నాడు ఎస్జె సూర్య. అలా అని ఆయన ఖాళీగా ఏమీ లేడు. రెండేళ్ల పాటూ ఆయన డేట్స్ దొరకనంత బిజీగా ఉన్నప్పటికీ సూర్య తను నటించిన సినిమాను ప్రమోట్ చేయడం చూసి నిర్మాతలు ఎంతో సంతోషిస్తున్నారు. గతంలో సరిపోదా శనివారం(Saripoda Sanivaram) సినిమా కోసం కూడా ఎస్జె సూర్య ఇలానే టీమ్ తో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు.













