Siva: అక్కినేని ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్

ఈ మధ్య టాలీవుడ్ లో రీరిలీజుల ట్రెండ్ ఎక్కువైన సంగతి తెలిసిందే. హిట్టూ, ఫ్లాపుతో సంబంధం లేకుండా ప్రతీ సినిమాను రీరిలీజ్ చేశారు. ట్రెండ్ లో భాగంగానే ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజై రికార్డులను కూడా సృష్టించాయి. ఇక అసలు విషయానికొస్తే అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) చేసిన కల్ట్ సినిమాల్లో ఆర్జీవీ(RGV) దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ శివ(Siva) సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
టాలీవుడ్ లో ఓ కొత్త ఒరవడిని క్రియేట్ చేసిన ఈ సినిమాను మళ్లీ థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ఎప్పట్నుంచో వర్క్ చేస్తున్నారు. రీసెంట్ గా నాగార్జున నటించిన మాస్ సినిమాను రీరిలీజ్ చేయగా, ఆ థియేటర్లలో శివ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేయగా ఆ గ్లింప్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు ఈ మోస్ట్ అవెయిటెడ్ రీరిలీజ్ కు ఫైనల్ గా డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం శివ ఈ ఇయర్ సెప్టెంబర్ 12న రీరిలీజ్ కాబోతున్నట్టు సమాచారం. దాని కోసం శివ ప్రింట్ ను నెక్ట్స్ లెవెల్ లో రీ క్రియేట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వార్త విని అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ఆడియన్స్ కూడా శివ కోసం ఎదురుచూస్తున్నారు.