మైత్రీని ఫాలో అవుతున్న సితార
ప్రస్తుతం మైత్రి దగ్గర ఉన్నన్ని సినిమాలు ఎవరి దగ్గరా లేవు. టాలీవుడ్లో జోష్ మీదున్న ఏ డైరెక్టర్ ని అడిగినా నెక్ట్స్ మైత్రితో సినిమా కమిట్మెంట్ ఉందని చెప్తారు. ఒక సినిమాకు మంచి టాక్ వచ్చిందంటే చాలు వెంటనే ఆ డైరెక్టర్ కి, హీరోకి అడ్వాన్సులు పంపేసి డేట్స్ బ్లాక్ చేసుకుంటారు. చిన్న డైరెక్టర్ నుంచి స్టార్ డైరెక్టర్ వరకు, డెబ్యూ హీరో నుంచి స్టార్ హీరోల వరకు అందరి డేట్స్ వారి దగ్గర ఉన్నాయి. మైత్రీని ఫాలో అవుతూ ఇప్పుడు అలాగే అందరికీ అడ్వాన్సులు ఇస్తూ పెద్ద ప్రొడక్షన్ హౌస్ గా ఎదగాలని ట్రై చేస్తుంది సితార ఎంటర్టైన్మెంట్స్. మొదట్లో ఈ బ్యానర్లో మీడియం బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాలే వచ్చాయి. తర్వాత భీమ్లా నాయక్ సినిమాతో ఈ బ్యానర్ పెద్ద సంస్థగా పేరొందింది. ప్రస్తుతం ఈ బ్యానర్ నుంచి దాదాపు పదిమంది యంగ్ డైరెక్టర్స్ అడ్వాన్సులు అందుకున్నారు.
వెంకీ అట్లూరి, వివేక్ ఆత్రేయ, గౌతమ్ తిన్ననూరి ఇలా నాగవంశీ నుంచి అడ్వాన్సులు అందుకున్న వారి లిస్ట్ చాలానే ఉంది. ఎంతోమంది క్రేజీ హీరోల డేట్స్ కూడా నాగవంశీ దగ్గరున్నాయి. సార్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సక్సెస్ ఊపుతో సినిమాలను నిర్మించడం వేగవంతం చేయనున్నారు. ఏడాదికి బ్యానర్ నుంచి నాలుగైదు సినిమాలైనా చేయాలని డిసైడైన నాగ వంశీ, ఆ సినిమాలకు సక్సెస్ఫుల్ డైరెక్టర్లనే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఫామ్ లో ఉన్న డైరెక్టర్లు, సక్సెస్తో ఉన్న దర్శకులకి అడ్వాన్సులు ఇస్తూనే ఉన్నారు నాగవంశీ.













