సైమా వేడుకలకు ముస్తాబవుతున్న దుబాయ్!
సైమా (సైత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుకలకు దుబాయ్ నగరం ముస్తాబవుతోంది. ఈ నెల 15, 16వ తేదీల్లో దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ వేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి. కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం సినీ ఇండస్ట్రీలకు చెందిన అద్భుతమైన సినిమాలకు ఈ అవార్డు వేడుకల్లో తగిన గౌరవం దక్కనుంది. సెప్టెంబరు 15న సాయంత్రం 7 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. సినీ తారలు చేరే ఈ వేడుకలకు హాజరయ్యే వాళ్లు స్మార్ట్ ఈవెనింగ్ వేర్లో రావలసి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అలాగే ప్లాటినమ్‌లిస్ట్ ద్వారా కొనుగోలు చేసిన టికెట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. సెకండరీ వెబ్‌సైట్స్‌లో కొనుగోలు చేసిన టికట్లను బ్లాక్ చేస్తారని, పలు దేశాల్లో ఇలా టికెట్లను సెకండ్ హ్యాండ్లో అమ్మడం నిషేధం అని హెచ్చరించారు. ఈ వేడుకలకు వచ్చే మూడేళ్లలోపు చిన్నారులకు ఎంట్రీ ఫ్రీ. అయితే 14 ఏళ్లలోపు పిల్లలు ఎక్కడకు వెళ్లాలన్నా పెద్దవాళ్లు తోడు ఉండాల్సిందే అని నిర్వాహకులు స్పష్టం చేశారు.













