టార్గెట్ ఫిక్స్ చేసుకున్న సిద్దు
డీజే టిల్లు, టిల్లు స్వ్కేర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ టాలీవుడ్ లో తన స్టామినాను ప్రూవ్ చేసుకున్నాడు. టిల్లు స్వ్కేర్ తో ఏకంగా రూ.100 కోట్ల మార్కెట్ అందుకున్నాడు సిద్దు. ఇప్పుడు సిద్దు క్రేజ్, మార్కెట్ రెండూ పెరిగాయి. చిన్న క్యారెక్టర్లతో మొదలై ఇప్పుడు రూ.100 కోట్లు కొల్లగొట్టే హీరోగా సిద్దు మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.
ప్రస్తుతం సిద్దు రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి జాక్, రెండోది తెలుసు కదా. తెలుసు కదా సినిమా లవ్ స్టోరీలా రూపొందుతుంది. జాక్ సినిమా సిద్దు రేంజ్ మూవీగా ఉండబోతుందని అంటున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో సిద్దు మరోసారి రూ.100 కోట్ల టార్గెట్ పెట్టుకున్నాడు.
అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత గ్యాప్ తీసుకున్న బొమ్మరిల్లు భాస్కర్ జాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ కథను వాస్తవానికి ధనుష్ తో చేయాల్సింవనొ బొమ్మరిల్లు భాస్కర్ చెప్పాడు. కానీ ఎందుకో కానీ అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు సిద్దు తో స్టార్ట్ చేశాడు. మరి జాక్ సినిమాతో సిద్దు మరో రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తాడా లేదా అన్నది చూడాలి.













