నా పని అయిపోలేదు.. ఇప్పుడే మొదలైంది
బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. ఓ మై ఫ్రెండ్ హీరో సిద్దార్థ్ సినిమాలు కొంతకాలంగా రావడం లేదు. దీంతో ఈయన సినిమాలకు స్వస్తి చెప్పాడని అనుకున్నారంతా. సామాజిక మాధ్యమాల్లో కూడా అదే ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ హీరో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. ఎవరు ఏమనుకున్నా నేను తిరిగి వస్తున్నాలే. ఈ మాటను గుర్తుంచుకోండి. మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తా. నా పని అయిపోలేదు. మళ్లీ వస్తానని ఒట్టేస్తున్నా. 18 నెలల సమయం ఇవ్వండి. నేనేమీ పడిపోలేదు. తీవ్రంగా శ్రమిస్తున్నా. మంచి కంటెంట్ ఉన్న కథతో వస్తున్నా అని ట్వీట్ చేశారు. ఇప్పటికే సిద్ధార్థ్ తెలుగులో సినిమాలు చేసే యోచనలో ఉన్నారు. రెండు మూడు కథలపై చర్చలు అంతిమ దశలో ఉన్నాయి.













