కమల్ హాసన్ కి మనవడిగా సిద్ధార్థ్?
కమల్‌హాసన్‌కి మనవడిగా సిద్దార్థ్ నటించబోతున్నారా? అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. కమల్‌హాసన్- శంకర్ కలిసి భారతీయుడు కి కొనసాగింపుగా భారతీయుడు 2 చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా లుక్‌ని సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. ఈ నెల 18 నుంచి చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. ఇందులో కమల్‌హాసన్‌కి మనవడి పాత్ర కీలకమట. ఆ పాత్ర కోసం పలువురు తమిళ కథానాయికుల్ని పరిశీలించిన దర్శకుడు శంకర్, సిద్దార్థ్‌ని ఖరారు చేశారని ప్రచారం సాగుతోంది. ఇందులో ఓ హిందీ కథానాయకుడు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. చిత్రం సెట్స్‌పైకి వెళ్లేలోపు ఆ విషయాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇందులో కమల్‌హాసన్ సరసన కాజల్ నటించబోతోంది.













