మహా సముద్రంలో సిద్ధార్థ్ ?
తొలిచిత్రం ఆర్ఎక్స్ 100తో విజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకుడు అజయ్ భూపతి. రెండో చిత్రం కోసం మహాసముద్రం పేరుతో ఓ కథని సిద్దం చేసుకున్నారు. ఇద్దరు హీరోలు కలిసి నటించాల్సిన చిత్రమిది. యువ కథానాయకుడు శర్వానంద్ ఇందులో నటించేందుకు ఇదివరకే పచ్చజెండా ఊపేశారు. రెండో హీరోగా సిద్ధార్థ్ నటించే అవకాశాలున్నట్టు సమాచారం. సిద్ధార్థ్ తెలుగులో సినిమా చేయక చాలా రోజులైంది. అజయ్ ఈ సినిమా గురించి చెబుతూ ఆర్ఎక్స్ 100 తరహాలోనే సాగే ఓ విభిన్న కథాంశంతో రూపొందుతోంది. వైజాగ్ నేపథ్యంగా సాగుతుంది. నాకు తెలిసి ఇదే నా తొలి, చివరి మల్టీస్టారర్. ఎందుకంటే ఇలాంటి కథ రాయడం ఒకటైతే.. దాన్ని ఇద్దరు హీరోలకు చెప్పి ఒప్పించడం మరొకెత్తు అన్నారు.













