ఆ హీరోయిన్ భలే లక్కీ!
ఎన్టీఆర్(NTR) హీరోగా నటించిన దేవర1(Devara1) సినిమా ఎల్లుండి రిలీజ్ కాబోతుంది. అయితే అందరూ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించే మాట్లాడుతున్నారు కానీ పెద్ద ఎన్టీఆర్ పక్కన నటించిన మరో అమ్మాయి కూడా అంతే లక్కీ గర్ల్ అని గుర్తించట్లేదు. డ్యూయల్ రోల్ చేస్తున్న తారక్ కు తల్లిగా నటిస్తున్న ఈ ఆర్టిస్ట్ పేరు శృతి మరాఠి(Shruthi Marathe).
దేవర1లో శృతి(Shruthi) కేవలం తల్లిగా వయసు మళ్లిన పాత్రలో మాత్రమే కనిపించడం లేదు. ఫస్టాఫ్ లో వచ్చే కీలక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ తో పాటూ సమానంగా ఈమె పాత్రకు ప్రాధాన్యత దక్కిందట. తన జాతి వారి కోసం పోరాడే భర్తకు అండగా నిలబడే పాత్రలో శృతికి మంచి ఎమోషనల్ సీన్స్ పడ్డాయని టాక్ వినిపిస్తోంది.
శృతి లుక్ దేవర సెకండాఫ్ లో మాత్రమే మారుతుందని.. దేవర, వర ఇద్దరితోనూ కాంబినేషన్ సీన్స్ ఉంది సైఫ్, శ్రీకాంత్ తర్వాత శృతికే అని తెలుస్తోంది. ఈ గుజరాతీ భామ ఇప్పటికే పలు హిందీ, మరాఠీ సినిమాలు, సిరీస్లు, సీరియల్స్ లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. దేవరతో సౌత్ లోకి డెబ్యూ చేస్తుంది. నటన పరంగా గత చిత్రాలన్నీ చూసి అంతా ఓకే అనుకున్నాకే దేవర కోసం అమ్మడిని ఆడిషన్ కు పిలిచారట. ఈ సినిమా హిట్ అయితే శృతికి టాలీవుడ్(Tollywood) లో వరుస అవకాశాలు దక్కడం ఖాయం. ఈ సినిమా రిజల్ట్ పై శృతి ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.













