శృతి సైలెన్స్ కు కారణమదేనా?
మరో పది రోజుల్లో రిలీజ్ కానున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ కు ఆ సినిమా విషయంలో పెద్దగా ఎగ్జమెంటేమీ ఉన్నట్లు కనిపించడం లేదు. రిలీజ్ దగ్గర పడుతున్నప్పటికీ ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు. హీరోనే బయటకు రానప్పుడు ఇక హీరోయిన్ గురించి ఏమంటాంలే అనుకోవచ్చు కానీ ఇదే శృతి హాసన్ వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య టైమ్ లో బాగా హడావిడి చేసింది.
అలాంటి శృతి సలార్ ప్రమోషన్స్ లో సైలెంట్ గా ఉండటానికి ఓ కారణముందట. ఈ సినిమాలో శృతి క్యారెక్టర్ కు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదట. కథ మొత్తం ప్రభాస్, పృథ్వీ రాజ్ మీదే ఉండటంతో డైరెక్టర్ శృతి క్యారెక్టర్ కు పెద్దగా స్కోప్ ఇవ్వలేదని తెలుస్తోంది. ట్రైలర్ లో కూడా శృతిని కేవలం ఒక్క షాట్ కే పరిమితం చేశాడు.
దానికి తోడు సలార్ ఎంత హిట్ అయినా శృతికి ఈ సినిమా వల్ల ఒరిగేదేమీ ఉండకపోవచ్చు. కెజిఎఫ్ హిట్ అయ్యాక శ్రీనిధి శెట్టికి కూడా లేట్ గా ఆఫర్లొచ్చాయి తప్పించి వెంటనే ఛాన్సులు రాలేదు. కానీ శృతి ఇవన్నీ ఎప్పుడో చూసేసి వచ్చింది. ఒకప్పుడు మంచి స్టార్డమ్ను ఎంజాయ్ చేసిన శృతికి ఇప్పుడు కొత్తగా హిట్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏమీ లేదు. డిసెంబర్ 22న రానున్న సలార్ పై ఆడియన్స్ లో మంచి అంచనాలున్నాయి.













