శృతి బాగానే వసూలు చేస్తుందే!
కరోనా టైమ్ లో మెయింటెనెన్స్ కు లేక అప్పులు తీర్చలేక, తన ఫ్లాట్ ను అమ్ముకున్నానని చెప్పిన కమల్ హాసన్ కూతురు శృతి హాసన్, అదే క్రైసిస్ టైమ్ లోనే వరుసగా మంచి హిట్లు అందుకుని మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ప్రభాస్తో పాన్ ఇండియా సినిమా సలార్ లో నటించిన ఈ బ్యూటీ నాని మూవీలో కూడా ఓ సాంగ్ తో పాటూ కీలక పాత్రలో నటించింది.
దీంతో పాటూ పలు సినిమాలకు సైన్ చేసిన శృతి, హాయ్ నాన్న కోసం బాగానే ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఓడియమ్మా అనే సాంగ్తో పాటూ పలు కీలక సన్నివేశాల్లో శృతి కనిపించనుంది. దీని కోసం అమ్మడు ఏకంగా రూ.90 లక్షలు వసూలు చేసిందని ఫిల్మ్ వర్గాలు చెప్తున్నాయి.
పెద్ద హీరోలతో నటించే టాలెంట్ ఉన్న శృతి తో ఈ పాత్ర చేయిస్తే తమ సినిమాకు కూడా ఎంతో కొంత లాభముంటుందని దర్శకనిర్మాతలు శృతిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్న ధీమాతో ఉన్నాడు నాని. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.













