Shraddha Kapoor: చాట్‌జీపీటీతో బాలీవుడ్ హీరోయిన్ టైంపాస్

సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిన నేపథ్యంలో చాట్‌జీపీటీ(chatGPT) మన రెగ్యులర్ లైఫ్ లో ఓ భాగమైంది. టెక్నాలజీని వాడి ఎంతో మంది తమ అనుమానాలను తొలగించుకుంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్(shraddha kapoor) కూడా అలానే చాట్‌జీపీటీని వాడుతూ టైమ్ పాస్ చేస్తున్నట్టు రీసెంట్ గా ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన స్టోరీ చూస్తే అర్థమవుతుంది.
రీసెంట్ గా శ్రద్ధా కపూర్ ఓ కేక్ ఫోటోను పోస్ట్ చేస్తూ తాను తినవలసిన ఎక్కువ కొవ్వు ఉన్న డిజర్ట్ ఏంటో చెప్పమని చాట్‌జీపీటీని అడుగుతూ, ఆ స్టోరీకి ఆమిర్ ఖాన్(aamir khan), జూహీ చావ్లా(Juhi chawla) నటించిన ఖయామత్ సే ఖయామత్ తక్(Khayamath se Khayamath thak) సినిమాలోని గజబ్ కా హై దిన్(Gajab ka hai din) సాంగ్ ను యాడ్ చేసింది. మొదటి నుంచి కూడా శ్రద్ధా కపూర్ మంచి భోజన ప్రియురాలనే విషయం తెలిసిందే.
సెప్టెంబర్ లో వినాయక నిమజ్జనం సందర్భంగా శ్రద్ధా ఒకేసారి 6 మోదక్‌లను ఒకేసారి తినేసింది. అంతేకాదు, గతంలో శ్రద్ధా కపూర్ షూటింగ్ లో జిలేబీలు తింటూ సెట్స్ నుంచి ఓ ఫోటోను షేర్ చేసింది. ఇవన్నీ చూస్తుంటే ఫుడ్ విషయంలో శ్రద్ధా ఎక్కడా కాంప్రమైజ్ కాదని అర్థమవుతుంది. ఇక సినిమాల విషయానికొస్తే, అమ్మడు ఛావా(Chhawa) డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్(Laxman utekar) దర్శకత్వంలో ఓ పీరియాడికల్ డ్రామా చేయనుండగా నవంబర్ నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.