పుష్ప2 ఐటెమ్ సాంగ్కు ఆమె ఫిక్స్
కథ ఎలాంటిదైనా సుకుమార్(sukumar) సినిమాలో కచ్ఛితంగా ఐటెమ్ సాంగ్ ఉండాల్సిందే. పుష్ప(Pushpa) సినిమాలో సమంత(samantha)తో ఊ అంటావా(Oo Antaava) అనే ఐటెమ్ సాంగ్ ను చేయించి ఆడియన్స్ ను ఉర్రూతలూగించాడు సుకుమార్. ఆ సాంగ్ ఎంత పాపులరైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు పుష్ప2(pushpa2) కోసం దేవీ శ్రీ ప్రసాద్(devi sri prasad) అంతకుమించిన సాంగ్ ను కంపోజ్ చేశాడని టాక్.
డిసెంబర్ 6న పుష్ప2 రిలీజ్ కానుంది. రిలీజ్ కు మరో నెలన్నరే ఉంది. ఇంకా ఆ ఐటెమ్ సాంగ్ షూటింగ్ అవలేదు. కనీసం ఇప్పటివరకు ఆ సాంగ్ ను ఎవరు చేయనున్నారనేది కూడా చెప్పడం లేదు. అయితే ఈ సాంగ్ కోసం ఎంతోమందిని ట్రై చేసిన సుకుమార్(sukumar) ఆఖరికి బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్(shraddha Kapoor) ను ఫైనల్ చేసినట్లు తాజా సమాచారం అందుతుంది.
రెండ్రోజుల ముందే పుష్ప2 మేకర్స్ శ్రద్ధాకు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారట. నవంబర్ ఫస్ట్ వీక్ లో సాంగ్ షూట్ ఉంటుందని సమాచారం. రీసెంట్ గా స్త్రీ2(Stree2) బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో శ్రద్ధా క్రేజ్ ను వాడుకోవాలనే నేపథ్యంలో ఈ సాంగ్ కు ఆమెను సెలెక్ట్ చేశారు. పుష్ప2కు బాలీవుడ్ లో మంచి బజ్ ఉంది. అలాంటి సినిమాలో శ్రద్ధా ఐటెమ్ సాంగ్ చేస్తే అక్కడి ఆడియన్స్ మరింత ఊగిపోతారనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు













