Vijay Devarakonda: నాని డైరెక్టర్ తో విజయ్ సినిమా?
హాయ్ నాన్న(Hi Nanna) సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన శౌర్యువ్(Showryuv) మొదటి సినిమాతోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. సెన్సిటివ్ కథను శౌర్యువ్ హ్యాండిల్ చేసిన విధానానికి అందరూ ఫిదా అయ్యారు. దీంతో అతను రెండో సినిమాను ఎవరితో చేస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోగా, ఈ నేపథ్యంలోనే జూ. ఎన్టీఆర్(Jr. NTR) పేరు వినిపించింది.
ఎన్టీఆర్ కోసం శౌర్యువ్ ఓ యాక్షన్ స్టోరీని రాసుకున్నాడు. తారక్(Tarak) తోనే రెండో సినిమాను చేయాలని శౌర్యువ్ ఎంతో ట్రై చేసినప్పటికీ అది కుదరలేదు. దానికి కారణం ఎన్టీఆర్ పలు సినిమాలతో బిజీగా ఉండటం. దీంతో శౌర్యువ్ అదే కథను విజయ్ దేవరకొండతో చేయాలని అతనితో చర్చలు జరుపుతున్నట్టు ఇన్సైడ్ వర్గాల నుంచి లీకులందుతున్నాయి.
ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri)తో కింగ్డమ్(Kingdom) చేస్తున్న విజయ్, ఆ తర్వాత రవికిరణ్ కోలా(Ravikiran Kola)తో రౌడీ జనార్థన్(Rowdy Janardhan), రాహుల్ సాంకృత్స్యన్(Rahul Sankrithyan) తో ఓ సినిమా చేయనున్నాడు. ఆ రెండింటి తర్వాత విజయ్ చేయబోయే సినిమా శౌర్యువ్ తోనే అని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే విజయ్ ప్రస్తుతం చేస్తున్న కింగ్డమ్(Kingdom) సినిమా కూడా ముందు రామ్ చరణ్(Ram Charan) దగ్గరకు వెళ్లి వచ్చింది. అప్పుడు చరణ్ చేయలేకపోయిన కథను ఓకే చేసిన విజయ్, ఇప్పుడు ఎన్టీఆర్ చేయలేని ప్రాజెక్టుకు కూడా ఓకే చెప్తాడా అన్నది చూడాలి.






