షార్ట్ టెంపర్ చిత్రం ప్రారంభం
నవీన్, షాలిని చౌహన్ నటీనటులుగా ప్రవీణా క్రియేషన్స్ పతాకంపై షార్ట్ టెంపర్ చిత్రం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. రాఘవ దర్శకత్వంలో ఎన్.ఆర్.ఆర్ నిర్మిస్తున్నారు. ఆలీ, ఆదిత్య ఓం కీలక పాత్రల్లో కనిపిస్తారు. ముహూర్తపు సన్నివేశానికి బెక్కెం వేణుగోపాల్ క్లాప్ ఇవ్వగా, శివాజీరాజా కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాత మాట్లాడుతూ డిఫరెంట్ కథను ఎన్నుకుని మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తున్నా. ఎక్కువశాతం బ్యాంకాక్‌లో చిత్రీకరిస్తాం అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ కమిర్షియల్ అంశాలతో వినోదాత్మకంగా సాగే చిత్రమిది. ఈ నెలాఖరులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం అని అన్నారు.













