రన్నింగ్ టైం తో భయపెడుతున్న వారసుడు..
ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లో ఇప్పుడు వారసుడు ఫీవర్ నడుస్తుంది. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, తమిళ సూపర్ స్టార్ హీరో దళపతి విజయ్ తో కలిసి “వారీసు” సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సినిమాని “వారసుడు”గా తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. సినిమా రిలీజ్ అనుకున్నప్పటి నుండి ప్రతి రోజు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఒక రకంగా ఈ సినిమాకి ఇది కూడా ఫ్రీ పబ్లిసిటీ అని చెప్పుకోవొచ్చు.
వారీసు సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించారు నిర్మాత దిల్ రాజు. హీరో విజయ్ కి 100 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఈ సినిమా తీసినట్టు టాక్. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ శ్యాం లాంటి భారీ నటీనటులతో ఈ సినిమాని తెరకెక్కించారు. రష్మిక మందన్న కథానాయికగా నటించడం కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. ఇన్ని స్పెషల్ అంశాలు ఉన్నాయి కాబట్టే తెలుగులో ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించుతున్నారు దిల్ రాజు.
ఒక వైపు మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, నందమూరి బిడ్డ బాలయ్య వీర సింహా రెడ్డి ఆల్రెడీ సంక్రాంతి బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో డైరెక్ట్ తెలుగు సినిమాలకి పోటీగా వస్తున్న వారసుడు సినిమా రిస్క్ తీసుకుంటుందనే చెప్పాలి.ఇక ఈ సినిమా రన్ టైం విషయంలో ఫ్యాన్స్ కాస్త భయపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది. ఇలాంటి సమయంలో ఈ మూవీ రన్ టైం కూడా 2 గంటల 50 నిమిషాలు అంటే 170 నిమిషాలు దాకా ఉంటుందని తెలుస్తుంది. సెన్సార్ టీం యు సర్టిఫికెట్ ఇచ్చినా సినిమా రన్ టైం అంత ఎక్కువ ఉండటం ఆడియన్స్ కు షాక్ అవుతున్నారు.
కోలీవుడ్ లో మాత్రం వారిసు సినిమా సంచలనం సృష్టించేలా ఉంది. విజయ్ ఇమేజ్ కు కంప్లీట్ ఫుల్ ప్యాక్డ్ మూవీగా ఈ సినిమా అక్కడ ఆడియన్స్ ని అలరించేలా ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్ జనవరి 11న ఫిక్స్ చేసారు. తెలుగులో ఇంతవరకు వారసుడుకి సంబంధించిన ఈవెంట్ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ప్రమోషన్స్ కోసం విజయ్ ని హైదరాబాద్ రప్పించాలని దిల్ రాజు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.













