Shivathmika: జిమ్ లో కుస్తీలు పడుతున్న శివాత్మిక

హీరోయిన్ గా ఉండాలనుకుంటే ఎవరైనా సరే ఫిట్ గా ఉండటం తప్పనిసరి. ఇప్పుడేం సినిమాలు చేయట్లేదు కదా అని లైట్ తీసుకుంటే తర్వాత వచ్చే ఆఫర్లు కూడా వెనక్కెళ్తాయి. అందుకే హీరోయిన్లు ప్రతీ రోజూ జిమ్ చేస్తూ తమని తాము ఫిట్ గా ఉంచుకుంటారు. టాలీవుడ్ యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్(Shivathmika Rajasekhar)కూడా ఇప్పుడదే పని చేస్తోంది.
అమ్మడు తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోలో శివాత్మిక బ్లాక్ అండ్ బ్లాక్ షార్ట్ మరియు ఫుల్ స్లీవ్స్ ఉన్న టీ షర్టు ధరించి బరువులతో ఎంతో ఈజీగా స్వ్యాట్స్ చేసేస్తుంది. స్వ్కాట్స్ చేస్తున్నప్పుడు శివాత్మిక ఎనర్జీ, ఫోకస్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదే వీడియోలో శివాత్మిక లెగ్ మెషీన్ పై కూడా వర్కవుట్స్ చేసింది.
మొత్తానికి ఈ వీడియో ద్వారా శివాత్మిక జిమ్ లో హీరోయిన్లు పడే కష్టాన్ని అందరికీ తెలియచేసింది. బాలీవుడ్ హీరోయిన్లలా శివాత్మిక జిమ్ చేస్తున్నప్పుడు మేకప్ లో లేదు. ఈ వీడియోలో శివాత్మిక ఫుల్ చెమటతో తడిచిపోయింది. ఇక శివాత్మిక కెరీర్ విషయానికొస్తే దొరసాని(Dorasani) సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన అమ్మడు ఆఖరిగా కృష్ణ వంశీ(Krishna Vamsi) దర్శకత్వంలో వచ్చిన రంగ మార్తాండ(Ranga Marthanda) సినిమాలో నటించింది. ఆ తర్వాత నుంచి శివాత్మిక నుంచి ఎలాంటి ప్రాజెక్టు అనౌన్స్ అయింది లేదు.