గ్లామర్ డోస్ పెంచుతున్న శివాత్మిక రాజశేఖర్..!
వెర్సటైల్ హీరో రాజశేఖర్, జీవిత రాజశేఖర్ ఒకప్పుడు స్క్రీన్ మీద హిట్ పెయిర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. రీల్ లైఫ్ లోనే కాకుండా, రియల్ లైఫ్ లో కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరి కూతుర్లు ఇద్దరు కూడా రీసెంట్ గానే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు గా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. శివాని, శివాత్మిక ఇద్దరూ కూడా చిత్ర పరిశ్రమలో మంచి బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఓన్ టాలెంట్ తోనే ముందుకి వెళ్లాలనుకుంటున్నారు. స్వయంకృషితో టాలీవుడ్ లో అవకాశాలను అందుకునే విధంగా అడుగులు వేస్తున్నారు.
శివాత్మిక విషయానికి వస్తే సినిమాలతోనే కాకుండా తన గ్లామర్ తో సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ ను ఎంతగానో ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఈ అమ్మడు రీసెంట్ గా మరోసారి ఊహించని స్థాయిలో చాలా అందంగా దర్శనమిచ్చింది. గతంలో ఇంతకంటే ఘాటైన స్టిల్స్ తో ఫోటో షూట్ చేసింది. కానీ, ఈసారి జరిగిన ఫోటో షూట్ లో మాత్రం చాలా క్యూట్ గా ఉంది అని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. మంచి హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ సెన్స్ తో హాట్ గా ఫోజులిచ్చిన శివాత్మిక పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ బ్యూటీ మొదట “దొరసాని” అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. ఇక తర్వాత శివాత్మికకు ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాలేదు. ఇవేమి పట్టించుకోని శివాత్మిక తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా సినిమాలు చేయడానికి రెడీ అవుతుండడం విశేషం.
ఈ తరుణంలోనే తమిళం లో ఈ అమ్మడికి మంచి అవకాశాలు లభిస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కువగా అయితే ఇప్పటివరకు చిన్న సినిమాలలోనే తన లక్ ని పరీక్షించుకునే ప్రయత్నం చేసింది శివాత్మిక. ఇక త్వరలో రిలీజయ్యే “రంగమార్తండ” సినిమాలో కూడా ఆమె ఒక కీలకపాత్రలో నటించినట్లుగా క్లారిటీ ఇచ్చింది. ఇంత హాట్ గా, క్యూట్ గా ఇచ్చిన స్టిల్స్ చూసైనా ఈ ముద్దుగుమ్మకి కెరీర్ లో మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం.













