శంకర్ నోరు తెరవాల్సిందే!
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని తెలిసి ఫ్యాన్స్ ఎంతో ఆనందపడిపోయారు. కానీ ఇప్పుడా పరిస్థితులు లేవు. శంకర్ కనిపిస్తే చరణ్ ఫ్యాన్స్ ఏం చేస్తారో అన్న రీతిలో ఉంది సిట్యుయేషన్. గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ ఏకండా మూడేళ్లు మరో ప్రాజెక్ట్ ఒప్పుకోకుండా ఉన్నాడు.
అయినా ఇప్పటికీ గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి కాలేదు. ఇక రిలీజ్ డేట్ గురించైతే నిర్మాత దిల్ రాజుకి, హీరో చరణ్ కు కూడా ఎప్పడునేది తెలియదు. ఈ సినిమా రిలీజ్ శంకర్ చేతిలోనే ఉంది. ఇండియన్2 వల్లే ఇదంతా అని తెలియడంతో దిల్ రాజు కూడా ఏం చేయలేని సిట్యుయేషన్. ప్రస్తుతం తాజా షెడ్యూల్ చిత్రీకరణలో టీమ్ బిజీగా ఉంది.
అయితే ఈ సినిమా విషయంలో శంకర్ మౌనంగా ఉండటం ఫ్యాన్స్ ను అసహనానికి గురి చేస్తుంది. అప్డేట్స్ విషయంలో అసలేమాత్రం శంకర్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మొన్నీమధ్య దిల్ రాజు సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామన్నాడు. కానీ ఆ టైమ్ కు ఓజీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోవడంతో ఇప్పుడు గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాదికి వెళ్లనుందని వార్తలొస్తున్నాయి. చరణ్ మాత్రం సినిమా రిలీజ్ ను పక్కన పెడితే తన పార్ట్ షూటింగ్ మార్చి కల్లా పూర్తి చేసి బయటకు రావాలని చూస్తున్నాడు. ఏదేమైనా గేమ్ ఛేంజర్ సైలెన్స్ ను బ్రేక్ చేయాలంటే శంకర్ నోరు తెరవాల్సిందే.













