‘శైలజా రెడ్డి అల్లుడు’ ట్రైలర్ విడుదల
నాగ చైతన్య, అను ఎమ్యాన్యుయేల్ జంటగా మారుతి తెరకెక్కించిన చిత్రం “శైలజా రెడ్డి అల్లుడు”. ఈ చిత్రంలో రమ్యకృష్ణ అత్త పాత్రలో నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ శైలజా రెడ్డి అల్లుడు చిత్రాన్ని రూపొందిస్తుంది. శైలజా రెడ్డి చిత్రం కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకులని తప్పక అలరిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ నాగార్జున బర్త్ డే కానుకగా విడుదల కావాల్సి ఉండగా.. నందమూరి హరికృష్ణ హఠాన్మరణంతో వాయిదా వేశారు.
సెప్టెంబర్ 13న మూవీ విడుదలకి ప్లాన్ చేస్తుండగా, నిర్మాతలు మూవీపై ఆసక్తి కలిగేలా భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇటీవల చిత్రానికి సంబంధించి పలు సాంగ్స్ విడుదల చేసిన టీం తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో చైతూ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక ట్రైలర్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు సినిమాటోగ్రఫీ చాలా అందంగా ఉంది. గోపిసుందర్ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.













