షాహిద్ కపూర్ కు అరుదైన గౌరవం
పద్మావత్ సినిమాలో మహారాజా రతన్‌సింగ్ పాత్రలో అలరించిన బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌కు అరుదైన గౌరవం దక్కింది. టుసాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే, ఇది ఢిల్లీలోని మ్యూజియంలోనా? లేదా లండన్లోనా? అనే విషయంపై సృష్టత రావాల్సి ఉంది. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తూ షాహిద్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో త్వరలో వస్తున్నాను అనే క్యాప్షన్‌తో ఓ ఫొటో ఫోస్ట్ చేశారు. ఈ గౌరవాన్ని సొంతం చేసుకున్న బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, మాజీ క్రికెట్ సచిన్ తెందూల్కర్ సరసన ఇప్పుడు షాహిద్ కపూర్ నిలిచాడు.













