స్పీడు పెంచిన శేష్
విభిన్న కథలను ఎంచుకుని అందులో సస్పెన్స్, థ్రిల్ తో పాటూ యాక్షన్ కూడా ఉండేలా చూసుకుంటాడు అనే పేరు తెచ్చుకున్నాడు అడివి శేష్. ఈ ఏడాది అతన్నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. తన నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే స్పెషల్ గా వెయిట్ చేసే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు.
అలాంటి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్తూ ఇవాళ అడివి శేష్ ట్వీట్ చేశాడు. 2025లో తన నుంచి ఏకంగా మూడు రిలీజులుంటాయని చెప్పి అడివి శేష్ మంచి షాక్ ఇచ్చాడు. అయితే శేష్ చెప్పిన వాటిలో ఒకటి గూఢచారి2. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమా స్క్రిప్ట్ కు రెండేళ్లకు పైగా ఖర్చు పెట్టారు.
రెండోది శృతి హాసన్ తో చేస్తున్న డెకాయిట్. ఈ రెండు సినిమాలను సమాంతరంగా పూర్తి చేస్తున్న శేష్, మూడో సినిమా ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరి మూడోది సినిమానా లేక వెబ్ సిరీసా లేక సొంతంగా ఏదైనా ప్రయోగం చేస్తున్నాడా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఏదైనా సరే శేష్ స్పీడ్ పెంచి ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో ఆడియన్స్ ను పలకరించనున్నాడనేది మాత్రం గుడ్ న్యూసే.













