Senthil Kumar: SSMB29 కు అందుకే వర్క్ చేయట్లేదు

రాజమౌళి(rajamouli)- సెంథిల్(Senthil) కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన రెండు సినిమాలకు తప్ప మిగిలిన అన్నింటికీ సెంథిలే సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. రాజమౌళి విజన్ ను పర్ఫెక్ట్ గా స్క్రీన్ పై చూపించడంలో సెంథిల్ పాత్ర చాలా ఉందని స్వయంగా రాజమౌళినే ఎన్నో సార్లు చెప్పారు. అలాంటి సెంథిల్ ను రాజమౌళి ఎస్ఎస్ఎంబీ29(SSMB29) కోసం పక్కన పెట్టేశారు.
దీంతో రాజమౌళికి, సెంథిల్ కు మధ్య ఏమైందని అందరూ అనుకుంటున్నారు. తాజాగా సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన జూనియర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన సెంథిల్ ఈ విషయంలో స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తనకు, జక్కన్న(Jakkanna)కు మధ్య ఎలాంటి సమస్యలు లేవని, గతంలో కూడా తాను ఉన్నప్పుడే మర్యాద రామన్న(maryada ramanna), విక్రమార్కుడు(vikramarkudu) సినిమాలను వేరే వారితో చేశారని చెప్పారు సెంథిల్.
ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ29 కోసం రాజమౌళి ఏదో కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారని, అందుకోసమే ఆయన వేరే వారితో వర్క్ చేస్తున్నారని, కుదిరితే మళ్లీ భవిష్యత్తులో ఇద్దరం సినిమాలు చేస్తామని సెంథిల్ అన్నారు. దీంతో ఎస్ఎస్ఎంబీ29 కోసం రాజమౌళి, సెంథిల్ ను ఎందుకు పక్కనపెట్టారో క్లారిటీ వచ్చింది. కాగా జూనియర్(Junior) సినిమా జులై 18న రిలీజ్ కానుంది.