Lenin: అఖిల్ మూవీలో సీనియర్ హీరో గెస్ట్ రోల్

అక్కినేని అఖిల్(akkineni akhil) హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా సినిమాలవుతున్నా అతనికి ఇప్పటివరకు సాలిడ్ సక్సెస్ మాత్రం దక్కలేదు. ఎంతో కష్టపడి, ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన ఏజెంట్(agent) సినిమా డిజాస్టర్ గా నిలవడంతో సినిమాల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించిన అఖిల్, ఈ సారి ఎలాగైనా మంచి సినిమా తీసి ఆడియన్స్ ను మెప్పించడంతో పాటూ గట్టి హిట్ కొట్టాలని కసి మీదున్నాడు.
అందులో భాగంగానే మురళీ కిషోర్ అబ్బూరి(murali kishore abburi) దర్శకత్వంలో సినిమాను ఓకే చేసి దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు అఖిల్. లెనిన్(lenin) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే 80% టాకీ పార్ట్ కూడా పూర్తైనట్టు తెలుస్తోంది. లెనిన్ కు సంబంధించి మరో షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అయితే ఇప్పుడీ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
లెనిన్ మూవీలో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ ఉందని, ఈ పాత్రలో ఓ సీనియర్ హీరో కూడా కనిపిస్తారని తెలుస్తోంది. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఈ క్యారెక్టర్ చుట్టూ ఓ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటుందని అంటున్నారు. మరి ఆ స్పెషల్ రోల్ చేసే సీనియర్ హీరో ఎవరనేది తెలియాల్సి ఉంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ లవ్ స్టోరీపై అఖిల్ చాలానే ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈసారైనా అఖిల్ ఆశలు నెరవేరుతాయేమో చూడాలి.