రవితేజ మూవీలో కీలక పాత్ర చేయనున్న డైరెక్టర్
ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోయే హీరో మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి టైగర్ నాగేశ్వరరావు, రెండోది ఈగల్. టైగర్ నాగేశ్వరరావు దసరా కానుకగా రిలీజ్ కానుండగా, ఈగల్ వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ రెండు సినిమాల తర్వాత రవితేజ, తనకు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. రష్మిక హీరోయిన్గా నటించనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. గోపీచంద్ ప్రస్తుతం ఈ సినిమాలో కాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో ఉండగా ఇందులో భాగంగా తమిళ డైరెక్టర్ సెల్వ రాఘవన్కు ఓ కీ రోల్ ఆఫర్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.
క్యారెక్టర్ నచ్చడంతో సెల్వ రాఘవన్ కూడా ఆ పాత్ర చేసేందుకు ఒప్పుకున్నాడట సమాచారం. క్రాక్ సినిమాలో తమిళ డైరెక్టర్ సముద్రఖనితో విలన్ రోల్ చేయించిన గోపీచంద్, ఇప్పుడు సెల్వ రాఘవన్ తో ఎలాంటి పాత్ర చేయిస్తాడో చూడాలి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి మొదలు కానున్నట్లు సమాచారం.













