Seetha Prayanam Krishna Tho: సీత ప్రయాణం కృష్ణ తో నవంబర్ 14న గ్రాండ్ రిలీజ్ …
ఖుషి టాకీస్ పై నిర్మించిన సీత ప్రయాణం కృష్ణ (Seetha Prayanam Krishna Tho) తో నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా లో రోజా భారతి, దినేష్, సుమంత్, అనుపమ నటించారు. ఈ చిత్రానికి దర్శకుడిగా దేవేందర్. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రెజెంటర్ గా డా. రాజీవ్, డా. రోజా భారతి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. శరవణ వాసుదేవన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం ప్రెస్ మీట్ గ్రాండ్ గా హైదరాబాద్ లో నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో..
హీరోయిన్ డా.రోజా భారతి మాట్లాడుతూ … ముందు గా ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్తున్నా. నన్ను నమ్మి అందరు ఈ సినిమా నాది అని అనుకుని అందరూ పనిచేసారు కాబట్టే ఇవాళ రిలీజ్ వరకు రాగలిగాం. అందరు నవంబర్ 14 న మా సినిమా ని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
హీరో దినేష్ మాట్లాడుతూ .. నాకు సినిమాలో అవకాశం ఇచ్చిన రోజా గారికి, రాజీవ్ గారికి చాల థాంక్స్. వాళ్లిద్దరూ లేకపోతే ఈరోజు ఈ రోజు మేము ఇక్కడ ఇలా ఉంది మాట్లాడలేము. కచ్చితంగా మా సినిమా అందరిని ఎంటర్టైన్ చేస్తుందని ఆశిస్తున్నాను.
హీరోయిన్ రాఖి శర్మ మాట్లాడుతూ.. నాకు ఈ మూవీ లో ఛాన్స్ ఇచ్చిన రాజీవ్ గారికి, రోజా భారతి గారికి చాలా థాంక్స్. ఈ చిత్రం లో రాధికా అనే క్యారెక్టర్ లో నటిస్తున్న నాకు ఈ రోల్ చాలా స్పెషల్. సీత ప్రయాణం కృష్ణ తో మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నా.
డా.రాజీవ్ మాట్లాడుతూ.. ఇక్కడకి వఛ్చిన మీడియా మిత్రులకి, నా సినిమా ఫామిలీ కి చాలా థాంక్స్. ఈ సినిమా మాకు చాలా సెంటిమెంట్. సినిమా లో నటించి, ప్రొడ్యూసర్ గా డా. రోజా భారతి గారు మాకు ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది. అందరు నవంబర్ 14 న మా సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా.
డైరెక్టర్ దేవేందర్ మాట్లాడుతూ.. సీత ప్రయాణం కృష్ణ సినిమా లో పని చేసిన ప్రతి ఆర్టిస్ట్ కి టెక్నీషియన్ కి థాంక్ యూ. మా సినిమా ని అన్ని తానై మోసిన రోజా భారతి గారికి ఎప్పుడూ రుణ పడి ఉంటాను. నవంబర్ 14 న రిలీజ్ అవుతున్న మా సినిమా ని అందరూ చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటునాను.







