Satyaraj: రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే

బాహుబలి(baahubali) సినిమాతో తన క్రేజ్ ను అమాంతం పెంచేసుకున్నాడు సత్యరాజ్(Satyaraj). దాని కంటే ముందు కూడా సత్యరాజ్ ఎన్నో సినిమాలు చేసినప్పటికీ బాహుబలి ద్వారా ఆయనకు వచ్చిన క్రేజ్ ప్రత్యేకం, చాలా ఎక్కువ కూడా. ఆ సినిమా తర్వాత ఆయనకు అవకాశాలు కూడా చాలా ఎక్కువగా రావడం మొదలుపెట్టాయి. క్రేజ్ తో పాటూ రెమ్యూనరేషన్ కూడా పెరిగింది.
ప్రస్తుతం సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన త్రిబాణధారి బార్బరిక్(tribanadhari barbarik) అనే సినిమా వస్తోంది. ఆగస్ట్ 22న ఆ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న సత్యరాజ్ రెమ్యూనరేషన్ గురించి మాట్లాడాడు. గతంలో తానెన్నో సినిమాలు చేశానని, ఆ టైమ్ లో రెమ్యూనరేషన్ విషయంలో చాలా సార్లు రాజీ పడ్డానని చెప్పాడు.
హీరోగా నటించిన సినిమాల కోసం అవి రిలీజవడానికి అప్పులు కూడా చేసిన సందర్భాలున్నాయని, కానీ ఇప్పుడు తాను క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్నానని, ఇప్పుడు పారితోషికం విషయంలో వెనుకడుగేసే ప్రసక్తే లేదంటున్నాడు. కథ, బడ్జెట్ ను బట్టే తన పారితోషికం ఉంటుందని, బాహుబలి సినిమాకు తీసుకున్నంత రెమ్యూనరేషన్ బార్బరిక్ మూవీకి తీసుకోను కదా అని సత్యరాజ్ అన్నారు.