మరో కంటెంట్ ఓరియెంటెడ్ మూవీతో రానున్న సత్యదేవ్
వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సత్యదేవ్(Satyadev) ఇప్పుడు మరో ఇంటెన్స్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సమవర్తి(Samavarthi) అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించగా, టైటిల్‌తో పాటు రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. డైరెక్టర్ అజయ్ నాగ్ వి(Ajay Nag V) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రుద్ర పిక్చర్స్, పంచభూత ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ సౌత్ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీని ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రొజెక్ట్ చేస్తున్నారు.
ఫస్ట్‌లుక్ పోస్టర్లో సత్యదేవ్ కనిపించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చుట్టూ ఆయుధాలతో దాడికి దిగుతున్న వ్యక్తులు కనిపిస్తున్నప్పటికీ, అతను మాత్రం ప్రశాంతంగా, ఎలాంటి భయం లేకుండా నిలబడిన విధానం పాత్రలోని తీవ్రతను తెలియజేస్తోంది.
ఇవి కూడా చదవండి
ముఖ్యంగా అతని లుక్, బాడీ లాంగ్వేజ్ సినిమాలో ఒక క్రూరమైన కానీ న్యాయం కోసం పోరాడే వ్యక్తిత్వాన్ని సూచిస్తున్నట్లు కనిపిస్తోంది. సమవర్తి అనే పదానికి పురాణాల్లో యముడితో సంబంధం ఉండటం, న్యాయాన్ని సమానంగా అమలు చేసే శక్తిని సూచించడం ఆసక్తికరంగా మారింది. దీంతో సినిమాలో సత్యదేవ్ పాత్ర న్యాయం కోసం కఠిన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా ఉండొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ సినిమాలో మలయాళ నటుడు దిలీష్ పోతాన్(Dileesh Pothan)తో పాటు రాజీవ్ కనకాల(Rajeev Kanakala), రవీంద్ర విజయ్(Ravindra Vijay), గణవి లక్ష్మణ్(Ganivi Lakshman), మోహన్ భగత్(Mohan Bhagath) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యం పెరుగుతున్న సమయంలో సమవర్తి ఫస్ట్‌లుక్‌తోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం విశేషంగా మారింది.
ఇవి కూడా చదవండి







