ఓటిటి హీరో సత్యదేవ్ కి మెగా మూవీలో ఛాన్స్
యువ హీరో సత్యదేవ్ కు మరో లక్కీ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. 2020 లో తొమ్మిది నెలల పాటు థియేటర్లు మూతపడగా ఓటిటిల జోరు కొనసాగించాయి. అయితే ఓటిటిలో లాస్ట్ ఇయర్ సత్యదేవ్ నటించిన నాలుగు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఉమ్మామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత కన్నడ సూపర్ హిట్ మూవీ లవ్ మాక్ టైల్ రీమేక్ గుర్తుందా శీతాకాలం సినిమా చేస్తున్న సత్యదేవ్. ఆ సినిమాతో పాటుగా తిమ్మరుసు సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలతో పాటుగా మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ అందుకున్నాడని తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత లూసిఫర్ రీమేక్ చేస్తాడని తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఓ యువ హీరో పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో ముందు విజయ్ దేవరకొండని తీసుకుంటారని వార్తలు రాగా అది రూమరే అని తేలింది. ఫైనల్ గా లూసిఫర్ రీమేక్ లో మెగాస్టార్ తో పాటు సత్యదేవ్ కు ఛాన్స్ ఇచ్చినట్టు టాక్. చిరుతో స్క్రీన్ షేర్ అంటే అది మాములు విషయం కాదు. అందులోనూ చిరుతో ఫుల్ లెంగ్త్ మూవీ ఉండే పాత్రలో సత్య దేవ్ నటిస్తున్నాడని తెలుస్తుంది. మొత్తానికి సత్య దేవ్ కు మంచి టైం నడుస్తుందని చెప్పొచ్చు.













