సత్యమేమ జయతే ప్రారంభం
ఎం.వై.ఎం క్రియేషన్స్ సంస్థ రూపొందిస్తున్న సత్యమేవ జయతే-1948 చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈశ్వర్ బాబు.డి దర్శకుడు. ఎం.వై మహర్షి నిర్మాత. భారతీయ మరియు ముఖ్య అంతర్జాతీయ భాషల్లో రూపొందించబోతున్నారు. ముహుర్తపు సన్నివేశానికి శరద్ దద్భావాలా క్లాప్‌నివ్వగా, పి.జితేంత్ర కుమార్ కెమెరా స్విఛాన్ చేశారు. నాగినీడు గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ మహాత్మాగాంధీ హత్యకు గురికావడానికి 45 రోజులు ముందు నుంచి హత్య తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. వివాదాలకు అతీతంగా వాస్తవాల్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని నిర్మాత తెలిపారు. అలేఖ్య, రఘునందన్, ఆర్యవర్ధన్రాజు, నాగినీడు, జెన్నీ, సమ్మెట గాంధీ, ఇంతియాజ్, శరద్దబ్భావాలా, పి.శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: డాక్టర్ ఆర్యవర్ధన్రాజు, సంగీతం: శశిప్రీతమ్.













