సారంగదరియా.. సరికొత్త రికార్డు
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం లవ్‌స్టోరీ. ఈ సినిమాలో అచ్చమైన తెలంగాణ జానపద గీతం సారంగదరియా.. సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నది. విడుదలైన నాటి నుంచే దేశవ్యాప్తంగా సంగీతప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాతో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో 150 మిలియన్ల వీక్షణల మైలురాయిని చేరుకుంది. సుద్దాల అశోక్‌తేజ రచించిన ఈ గీతానికి పవన్.సిహెచ్ స్వరాల్ని సమకూర్చారు. తెలంగాణ జానపదంలోని విలక్షణత, సాయిపల్లవి అద్భుత నృత్యం వెరసి ఈ పాట యువతరాన్ని ఉర్రూతలూగిస్తోంది.













