Sara Tendulkar: పొట్టి స్కర్టులో చూపు తిప్పుకోనీయకుండా చేస్తున్న సారా

గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కూతురు సారా టెండూల్కర్(Sara Tendulkar) ఫ్యాషన్ ఎంపికల్లో ఎంతో ముందు ఉంటుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్ గా కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ మోడల్ గా రాణిస్తున్న సారా ఇప్పుడు మరోసారి గ్లామర్ దుస్తుల్లో కనిపించింది. తాజాగా సారా క్రీమ్ కలర్ పొట్టి స్కర్ట్ లో ఎంతో స్టైలిష్ గా కనిపించి అందరి చూపునూ తనవైపు తిప్పుకునేలా చేసింది.