Sara Arjun: ఫ్యూచరిస్టిక్ గౌనులో చూపు తిప్పుకోనీయకుండా చేస్తున్న సారా
నాన్న(Nanna) మూవీతో బాలనటిగా గొప్ప పేరు తెచ్చుకున్న సారా అర్జున్(Sara Arjun) ఇప్పుడు పెద్దదైంది. హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి కెరీర్లో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోన్న సారా రీసెంట్ గా దురంధర్(Durandhar) లో నటించి మంచి గుర్తింపే అందుకుంది. ఓ వైపు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సారా మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిరంతరం తన హాట్ ఫోటోషూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అందులో భాగంగానే తాజాగా సారా కిల్లర్ లుక్ లో కనిపించింది. ఈ ఫోటోల్లో సారా, అమిత్ అగర్వాల్(Amit Agarwal) డిజైన్ చేసిన ఫ్యూచరిస్టిక్ గౌనులో మరింత అందంగా కనిపించగా, ఆ ఫోటోలను నెటిజన్లు నెట్టింట వైరల్ చేస్తున్నారు.






