Sankranthiki Vasthunnam: వెంకీకి భలే కలిసొస్తుందే!
సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాల్లో ఆఖరిగా రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమా. రిలీజైన పది రోజుల్లోనే రూ.230 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమాకు మరో వారం కలిసొచ్చింది. నిన్న రిలీజైన సినిమాలకు కనీస టాక్ రాకపోవడం సంక్రాంతికి వస్తున్నాంకి బాగా కలిసొస్తుంది.
గాంధీ తాత చెట్టు(Gandhi Thatha Chettu) సినిమాపై ఆడియన్స్ లో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. టాక్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. హత్య(Hatya) సినిమా యావరేజ్ అనిపించినా కలెక్షన్లు టాక్ కు తగ్గట్టు లేవు. ఇక ఐడెంటిటీ(Identity) సినిమా ఓటీటీ డేట్ అనౌన్స్ చేసేయడంతో ఉన్న కాస్త ఆసక్తి కూడా పోయింది. ఈ పరిస్థితులన్నీ సంక్రాంతికి వస్తున్నాంకి ఫేవర్ గా మారాయి.
గత 24 గంటల్లో బుక్ మై షో(Book My Show) ద్వారా ఈ సినిమాకు లక్షకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకీ(Venky) క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. వీకెండ్ లో ఈ నెంబర్ డబుల్ అయినా అతిశయోక్తి లేదు. చూస్తుంటే ఫిబ్రవరి 7న తండేల్(Thandel) వచ్చే వరకు సంక్రాంతికి వస్తున్నాం హవా ఇంతే ఉండేలా అనిపిస్తోంది. అందుకే సినిమా ప్రమోషన్స్ ను ఆపకుండా సక్సెస్ ఈవెంట్ ను భీమవరంలో చాలా భారీగా నిర్వహించబోతుంది చిత్ర యూనిట్.













