Sanjana: శివాజీకి సపోర్ట్ గా ప్రభాస్ హీరోయిన్
ప్రభాస్(prabhas) బుజ్జిగాడు(bujjigadu) సినిమాలో సెకండ్ లీడ్ గా నటించిన సంజన(Sanjana) అందరికీ పరిచయమే. ఆ తర్వాత కూడా సంజన కొన్ని సినిమాల్లో నటించింది. తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన సంజన రీసెంట్ గా తెలుగు బిగ్ బాస్9(biggboss9) ద్వారా రీఎంట్రీ ఇచ్చి టాప్5 లిస్ట్ లో చేరి ఎంతో మంది ఫాలోయర్లను సంపాదించుకుంది. బిగ్ బాస్9 ద్వారా సంజనకు క్రేజ్ మామూలుగా పెరగలేదు.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజన తన హీరోయిన్ల డ్రెస్సింగ్ పై జరుగుతున్న ఇష్యూపై స్పందించారు. హీరోయిన్లు, ఆడవాళ్ల డ్రెస్సింగ్ గురించి రీసెంట్ గా శివాజీ(Sivaji) చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయిన టైమ్ లో సంజన తన సపోర్ట్ శివాజీకేనని, గ్లామర్ షో ను తప్పుబట్టారు. ఏదైనా అతిగా చేస్తే అది తర్వాత ఇబ్బందుల్నే తెస్తుందని, గ్లామర్ షో అయినా అంతేనని సంజన చెప్పుకొచ్చారు.
తాను కూడా గతంలో చాలా గ్లామర్ రోల్స్ చేశానని, కొన్నిసార్లు పొట్టి బట్టలు ఎందుకు వేసుకున్నానో కూడా తెలియదని, అవన్నీ ఇప్పుడు చూస్తే చాలా ఇబ్బందిగా ఉందని, పెళ్లి అయిపోయి పిల్లలు పుట్టాక అలాంటి ఫోటోలు చూసి ఇలా ఎందుకు చేశానని రిగ్రెట్ ఫీలవుతున్నట్టు చెప్పిన సంజన అప్పుడు తనకు తెలియకపోవడం, ఎవరూ చెప్పేవాళ్లు లేకనే అలా చేశానని చెప్పారు. దీంతో సంజన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













