Sandeep Reddy Vanga: స్పిరిట్ విషయంలో సందీప్ అలా అన్నాడేంటి?
ఎవరైనా సరే రిలీజ్ కు ముందు తమ సినిమాపై కాన్ఫిడెంట్ గా ఉంటారు తప్పించి తమ సినిమాల కలెక్షన్ల గురించి మాత్రం బయటకు చెప్పరు. సినిమాపై ఎంత నమ్మకమున్నా, తమ సినిమా బాగా కలెక్ట్ చేస్తుందని నమ్మకమున్నా ఆ విషయాన్ని మనసులోనే దాచుకుంటారు తప్పించి ఎప్పుడూ కలెక్షన్ల గురించి మాట్లాడే సాహసం చేయరు.
కానీ తెలుగు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(sandeep reddy vanga) మాత్రం ప్రభాస్(prabhas) తో తాను చేస్తున్న స్పిరిట్(Spirit) మూవీ కలెక్షన్ల గురించి అప్పుడే అంచనా వేసి ఓ ఫిగర్ కూడా చెప్పేశాడు. స్పిరిట్ మూవీ ఇంకా సెట్స్ పైకి కూడా వెళ్లకుండానే తన మూవీ రూ.2500 కోట్లు కలెక్ట్ చేస్తుందని అభిప్రాయపడ్డాడు. ఆ విషయంలో సందీప్ ను కొంతమంది అభినందిస్తుంటే మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు.
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి(rajamouli)నే ఇలాంటి స్టేట్మెంట్స్ ఎప్పుడూ చేయలేదు. పుష్ప(Pushpa) టైమ్ లో సుకుమార్(sukumar) కానీ, కెజిఎఫ్(KGF), సలార్(Salaar) టైమ్ లో నీల్(prasanth Neel) కానీ ఇలా మాట్లాడింది లేదు. కానీ సందీప్ ఇలా మాట్లాడటం విచిత్రంగా ఉందని అందరూ అభిప్రాయపడుతుంటే కొందరు మాత్రం స్పిరిట్ పై సందీప్ కు చాలా కాన్ఫిడెన్స్ ఉందని చెప్పడానికే ఆ మాట వాడాడని అంటున్నారు. మరి ఈ కాన్పిడెన్స్ ఏ మేరకు నెగ్గుతుందో చూడాలి.






