స్పిరిట్‌పై సందీప్ ఆసక్తికర వ్యాఖ్యలు
గతేడాది యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. ప్రస్తుతం యానిమల్ సీక్వెల్ గా రానున్న యానిమల్ పార్క్ కోసం ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. కబీర్ సింగ్ తో మంచి హిట్ అందుకున్నప్పటికీ సందీప్ రెడ్డి వంగ యానిమల్ తో టాప్ లీగ్ డైరెక్టర్ల లిస్ట్ లోకి చేరాడు. ఈ నేపథ్యంలోనే పలు బాలీవుడ్ సినిమా ఈవెంట్లకు గెస్టుగా సందీప్ హాజరవుతున్నాడు.
రీసెంట్ గా ఓ ఫంక్షన్ లో సందీప్ రెడ్డి వంగా యానిమల్ పార్క్ సినిమా ఇప్పట్లో ఉండదని క్లారిటీ ఇచ్చాడు. తను ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. స్పిరిట్ తర్వాతే ఇతర సినిమాల గురించి ఆలోచిస్తానని సందీప్ చెప్పాడు. అంతేకాదు ఈ సినిమా గురించి సందీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఒక సిన్సియర్ పోలీసాఫీసర్ కథను కొత్త దారిలో చెప్పబోతున్నానని, ప్రభాస్ ని గతంలో ఎప్పుడూ చూడని విధంగా స్పిరిట్ లో మేకోవర్ చేయనున్నట్లు వివరించాడు. ఇంతకంటే స్పిరిట్ గురించి ఎక్కువ డీటెయిల్స్ ను బయట పెట్టలేదు కానీ ఈ ఇన్ఫర్మేషన్కే ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి మరికాస్త టైమ్ పట్టే ఛాన్సుంది. ఇప్పటికే ప్రభాస్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, ఈ సినిమాకు డేట్స్ ఎప్పుడు కేటాయిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.













